Home Page SliderNational

అనంత్ -రాధికల వివాహంతో పాటు సామూహిక వివాహాలు..అంబానీ ప్రకటన

అంబానీ కుటుంబంలో పెళ్లిబాజాలు త్వరలో వినిపించనున్నాయి. జూలై 12న జరగబోయే అనంత్ అంబానీ, రాధికామర్చంట్‌ల వివాహ సందర్భంగా అంబానీ ఫ్యామిలీ సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించింది. జూలై 2న మహారాష్ట్ర పాల్గర్ స్వామి వివేకానంద విద్యామందిర్‌లో పేద కుటుంబాలకు చెందిన యువతీ, యువకులకు సామూహిక వివాహాలు జరిపించనున్నారు. దీనికయ్యే ఖర్చును నీతా అంబానీ, ముకేష్ అంబానీ భరించనున్నారు. అంబానీ దంపతులు స్వయంగా ప్రముఖుల ఇళ్లకు వెళ్లి తమ కుమారుని వివాహానికి ఆహ్వానాలు అందజేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు శుభలేఖను అందజేశారు. 2022సంవత్సరంలో వీరి ఎంగేజ్‌మెంట్ జరుగగా, వీరి ప్రీవెడ్డింగ్ వేడుకలు రెండు దఫాలుగా జరిగిన సంగతి తెలిసిందే.