మిస్త్రీ ప్రమాదం పై ఆనంద్ మహీంద్రా ట్వీట్
మిస్త్రీ ప్రమాద ఘటనపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరు తప్పకుండా సీటు బెల్ట్ ధరించాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కారులో వెనుక సీట్లో కూర్చున్నాసరే ఎల్లప్పుడూ సీటు బెల్టు ధరించాలని నిశ్చయించుకున్నా. మీరు కూడా ఆ ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మనం అందరం మన కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నాం అని ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు ఆనంద్ మహీంద్రా.