మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో భక్తుల కోసం ఆరా ఫౌండేషన్ అన్న ప్రసాద వితరణ
మహాశివరాత్రి సందర్భంగా ఆరా ఫౌండేషన్ అన్న ప్రసాద వితరణ బాధ్యతలను నిర్వర్తించడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు మొబైల్ వాహనాలతోపాటుగా, కోటప్పకొండ స్వామిని చేరుకునే వివిధ మార్గాల్లో అన్న ప్రసాద వితరణ కేంద్రాలను ఆరా ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది. తాజాగా ఈ ఏడాది కూడా ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసింది ఆరా ఫౌండేషన్.

మహాశివరాత్రి కోటప్పకొండ తిరుణాళ్ళ సందర్భంగా కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేయు భక్త జనుల కోసం ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి అంటే మార్చి 7,8 ,9 తేదీల్లో ఏర్పాటు చేసిన ఉచిత అన్న ప్రసాద వితరణ మొబైల్ వాహనాలను ఆరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ మస్తాన్ (ఆరా మస్తాన్) మద్దిరాల గ్రామంలో ప్రారంభించారు. ఏటా మహాశివరాత్రి సందర్భంగా అన్నప్రసాద వితరణ చేయడం మహాదేవుని ఆశీర్వాదం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆరా మస్తాన్ చెప్పారు. అటు భక్తులకు, ఇటు ఆర్టీసీ సిబ్బందికి, మున్సిపల్ కార్మికులకు, నిర్వాహకులకు ఆరా ఫౌండేషన్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏటా కొనసాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

