మానని గాయం… ముంబై మారణహోమం
నవంబర్ 26 ఘటనకు సూత్రధారులందరినీ న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చినప్పుడు.. ఆ ఘటనలో చనిపోయిన అమరులకు ప్రశాంతత లభిస్తుందన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. 26/11 ముంబయి ఉగ్రదాడుల బాధితులకు న్యాయం చేయడమంటే దోషులందరిని శిక్షించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద బాధితుడికి ఇండియా రుణపడి ఉందన్నారు. 26/11 ముంబయి ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన, పర్యవేక్షించిన వారిని చట్టం ముందుకు తీసుకురావాల్సి ఉందన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఉగ్రవాదం మానవాళికి ముప్పుగా పరిణమించిందన్న ఆయన… బాధితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నారు. ప్రపంచ యూదు కాంగ్రెస్ (WJC) 14వ వార్షికోత్సవానికి ముందు నవంబర్ 26, 2008న ముంబై తీవ్రవాద దాడులలో మరణించిన 166 మంది బాధితుల జీవితాలకు సంతాపం భారత ప్రభుత్వం సంతాపం తెలిపింది. ఈ ఘటనలో మరణించిన ముంబై చాబాద్ హౌస్‌లో రబ్బీ గావ్రియల్ హోల్ట్జ్‌బర్గ్ , అతని గర్భవతి అయిన భార్య రివ్కాతో సహా మరో నలుగురు బందీలను కూడా ఉగ్రవాదులు హతమార్చారు.

యూదు సమాజం తీవ్రవాద దాడులకు లక్ష్యంగా చేయబడిందని… ప్రపంచ యూదు కాంగ్రెస్ అభిప్రాయపడింది. ప్రజల మనస్సాక్షిని కదిలించిందని… అంతర్జాతీయంగా వివిమర్శల పాలైందని పేర్కొంది. కొలంబోలో, న్యూ డెమోక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ ముంబైలోని 26/11 ఉగ్రవాద దాడుల బాధితుల జ్ఞాపకార్థం శ్రీలంకలోని పాకిస్తాన్ హైకమిషన్ వెలుపల ప్రదర్శన నిర్వహించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఇస్లామాబాద్ కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. గంటకు పైగా సాగిన ఈ ప్రదర్శనలో ‘ఉగ్రవాద నిర్మూలన’, ‘ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు పాక్ మద్దతునివ్వాలని కోరింది. పాకిస్థానీ ఉగ్రవాదం దక్షిణాసియాకే కాదు యావత్ ప్రపంచానికే ముప్పు అంటూ గర్జించింది. 26/11 ముంబై ఉగ్రదాడుల ఘటనను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఎప్పటికీ మానని గాయమని అభివర్ణించారు. మరొకటి జరగకుండా తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ప్రతిజ్ఞ చేశారు. 26/11 దాడి కేసులో, ప్రస్తుతం యుఎస్‌లో ఖైదు చేయబడిన ఉగ్రవాద నిందితుడు డేవిడ్ హెడ్లీ శిక్ష అనుభవిస్తున్నాడు. మొత్తం ఘటనలో పాకిస్తాన్ ప్రేరేపిత శక్తుల పాత్ర పూర్తిగా ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
Terrorism threatens humanity.
Today, on 26/11, the world joins India in remembering its victims. Those who planned and oversaw this attack must be brought to justice.
We owe this to every victim of terrorism around the world. pic.twitter.com/eAQsVQOWFe
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 26, 2022

