అపూర్వ కలయిక… ఒకరు కాపు రిజర్వేషన్ల కోసం పోరాడారు.. మరొకరు కాపు రిజర్వేషన్లు ఇవ్వలేనన్నారు…
అనూహ్య ఘట్టాలకు రాజకీయాలు వేదికలవుతుంటాయి. ఒక్కోసారి ఒక్కో అంశం రాజకీయాలను ప్రభావితం చేస్తుంటాయి. అలాంటి ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా నిలుస్తోంది. జీవితం మొత్తం కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు, కాపు రిజర్వేషన్లు ఇవ్వలేమన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిశారు. ఒకరు రాజకీయంగా తమ కులానికి రిజర్వేషన్లు తెచ్చేందుకు పోరాటం చేస్తే, మరొకరు అది తన పరిధిలోనిది కాదని.. ప్రజలను అనవసరంగా భ్రమలకు గురి చేయనన్న నేత మరొకరు.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇలాంటి ఘటన ఇప్పుడు ఏపీలో జరిగింది. ముద్రగడ పద్మనాభం, ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాస్తవానికి సంక్రాంతి తర్వాత ముద్రగడ జనసేనలో చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే అది ఎందుకో ఆచరణలో సాధ్యం కాలేదు. ఆయన చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.