జోరుగా కొనసాగుతున్న సమగ్రసర్వే
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ కోటికి పైగా ఇళ్లలో సర్వే పూర్తయినట్లు సమాచారం. దీనితో 87 శాతం గృహాలు పూర్తయినట్లు తెలియజేశారు. హైదరాబాద్‌లో కూడా నూటికి నూరు శాతం కులగణన చేస్తామని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సవాల్ చేశారు. ఎలాంటి భయం లేకుండా సర్వే చేయాలని, ఎన్యూమరేటర్లకు సూచించారు. వారికి తోడు కోసం కావాలంటే కాంగ్రెస్ కార్యకర్తలను పంపిస్తామని పేర్కొన్నారు.