Home Page SliderTelangana

వాహన దారుల చలాన్లపై అదిరిపోయే ఆఫర్..

వాహనాల చలాన్ల విషయంలో తెలంగాణ పోలీస్ శాఖ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దీనితో వాహనదారులు ఖుషీ అవుతున్నారు. కార్లకు, స్కూటర్లకు చిన్న చిన్న కారణాల వల్ల చలాన్లు పడితే కట్టలేనివారికి ఇది అద్భుత అవకాశం. బైకులపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. ఇక కార్లపై, ఆటోలపై 60 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. గత సంవత్సరం బైకులపై 75 శాతం, కార్లపై 50 శాతం ప్రకటించగా రూ. 300 కోట్ల చలానాలు వసూలయ్యాయి. టూ వీలరో, కారో ఉన్నవారికి ఎక్కడో ఒకచోట, ఏదో ఒక సందర్భంలో చలాన్లు పడడం మామూలే. తెలంగాణలోని పెండింగ్ చలాన్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. దీనితో మళ్లీ రాయితీ ఇస్తే అవన్నీ వసూలవుతాయని భావిస్తున్నారు. కొన్ని చోట్ల స్పీడ్ లిమిట్ పాటించకపోవడం, కొన్నిచోట్ల సిగ్నల్ జంప్ చేయడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం వంటి చర్యలతో రాష్ట్రంలో  అధిక చలాన్లు ఏర్పడ్డాయి. అంతమొత్తం కట్టలేక, పోలీసులు పట్టుకున్నప్పుడు కడదాంలే అనుకుంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఇంత భారీ మొత్తంలో డిస్కౌంట్ ప్రకటించడంతో పూర్తి మొత్తం వసూలవుతుందని భావిస్తున్నారు పోలీసులు.