జనగామలో కలకలం రేపుతున్న అంతరాష్ట్ర దొంగలముఠా
జనగామలో దొంగల ముఠా హల్‌చల్ చేస్తోంది. వరుసగా తాళం వేసిన ఇళ్లలో జరిగే దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వీరు బీహార్, మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగలముఠాగా అనుమానిస్తున్నారు పోలీసులు. అర్థరాత్రి మారణాయుధాలతో మాస్క్ వేసుకుని సంచరిస్తున్న దొంగలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యారు. ఈ దృశ్యాలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. దీనితో ఇళ్లు తాళం పెట్టుకుని వెళ్లడానికి భయపడుతున్నారు ప్రజలు. నగరంలో గస్తీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


 
							 
							