Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

యూరియా అందించలేని చేతకాని ప్రభుత్వం

రాష్ట్రంలో అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగా మారాయని, సాగుకు అత్యంత కీలకమైన యూరియాను కూడా సకాలంలో సరఫరా చేయలేకపోవడం ప్రస్తుత ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అని మాజీ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లా ముష్టిపల్లి వంటి ప్రాంతాల్లో రైతులు ఎరువుల కోసం ఎదురుచూస్తుంటే, రైతు వేదికలకు తాళాలు వేసి అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దురదృష్టకరమని ఆమె మండిపడ్డారు. యాసంగి సీజన్‌లో చెమటోడ్చి పనిచేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి, వారిని రోడ్లెక్కి నిరసనలు తెలిపేలా చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, తక్షణమే ఎరువుల కొరతను తీర్చకపోతే ప్రజాగ్రహం తప్పదని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం ‘తెలంగాణ జాగృతి’ ద్వారా జనం బాట పట్టిన కవిత, అటు క్షేత్రస్థాయి సమస్యలపై పోరాడుతూనే, ఇటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాజకీయంగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.