అనూహ్యంగా టాలీవుడ్ సింగర్స్ వివాహం
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన టాలీవుడ్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరాలు వివాహం చేసుకోవడం టాలీవుడ్‌లో ఆశ్చర్యం కలిగించింది. ఎలాంటి రూమర్స్ లేకుండా అనూహ్యంగా వీరి వివాహ ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. వీరికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరూ వేర్వేరుగా, కలిసి కూడా ఎన్నో పాటలు పాడారు. వీరిద్దరూ కలిసి, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘ఆచార్య’ సినిమాలలో పాటలు పాడారు. రమ్య బెహరా ‘మహానటి’, ‘సీతారామం’ వంటి హిట్ చిత్రాలలో పాటలు పాడి అలరించింది. అనురాగ్ కులకర్ణి ‘శ్యామ్ సింగరాయ్’, ‘రాధేశ్యామ్’ వంటి చిత్రాలలో పాడారు. వీరు గత కొంతకాలం నుండి ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని అనుకుంటున్నారు. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ కూడా ఈ వివాహానికి హాజరయినట్లు లేదు. ఈ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.