పదేళ్ల ప్రజల కష్టాలకు ముగింపు..పొంగులేటి
పదేళ్ళ ప్రజల కష్టాలు బాధలకు ముగింపు పలికేలా దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చామన్నారు రాష్ట్ర రెవెన్యూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కల్లెక్టర్లు, డిప్యూటీ కల్లెక్టర్లతో మంత్రి ఆదివారం నాడు ఎంసిఆర్‌హెచ్ఆర్డిలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సామాన్యునికి అందుబాటులో ఉండేలా రెవెన్యూ సేవలను తీసుకురాబోతున్నాం అన్నారు. దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం-2024ను తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు. 33 జిల్లాలకు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కల్లెక్టర్లు, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా, దసరాలోపే ఎన్నికల బదిలీల తహసిల్దార్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు.