కలెక్టరేట్ లో ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్ కలెక్టరేట్ సముదాయంలో ఓ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. బాధితుడు అభిషేక్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో వీఆర్ఎగా పని చేశాడు. గతంలో ఖానాపూర్ తహశీల్దార్ గా పని చేసిన నరేందర్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఆర్డీవో ఆఫీసు డీఏఓగా బదిలీ కావడంతో సదరు ఉద్యోగి తన సర్వీస్ పుస్తకం తీసుకుని సంతకం కోసం వచ్చాడు. డీఏఓ తన సర్వీసు పుస్తకంలో సంతకం పెట్టడం లేదని విసుగు చెందిన అభిషేక్ పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న బాధితుడిని కలెక్టరేట్ ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని రిమ్స్ వైద్యులు తెలిపారు.

