ఒంటరితనంతో సూసైడ్ చేసుకున్న వృద్ధుడు
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సయ్యద్ జాఫర్ హుస్సేన్ (70) ఒంటరితనంతో విరక్తి చెంది ఆదివారం ఇంటిలో గ్రిల్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, కుమారులతో ఉండటానికి ఇష్టపడక, స్వగృహంలో ఒంటరిగా నివసించేవారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.