Home Page SliderInternational

ట్విటర్‌లో అదిరిపోయే ఫీచర్

ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి అందులో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్విటర్లో మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఎలాన్ మస్క్.  కాగా ఇకపై ట్విటర్‌లో వాయిస్,వీడియో కాల్స్ చేసుకునే వెసులుబాటును కల్పించనున్నట్టు ఎలాన్ మస్క్ తెలిపారు. అంతేకాకుండా ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఇందుకోసం ఎలాంటి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సిన  అవసరం లేదని ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీంతో ట్విటర్ యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.