Home Page SliderTelangana

ఆవును జాతీయ ప్రాణిగా సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

కాచిగూడ: ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించి సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గోసంరక్షణ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. పార్లమెంట్‌లో గోవధ నిషేధ బిల్లును ప్రవేశపెట్టి సత్వరం ఆమోదించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశాయి. సర్వదళీయ గోరక్షా మంచ్ ఆధ్వర్యంలో.. ఈ నెల 6న రవీంద్రభారతిలో గోమాతకు 56 రకాల ప్రసాదాలు, అన్నప్రసాదం, సీతారాముల కళ్యాణం నృత్య ప్రదర్శనకు హాజరు కావాలని కోరుతూ శుక్రవారం కాచిగూడకు చెందిన తెలంగాణ లౌ ఫర్ కౌ ఫౌండేషన్ ఛైర్మన్ జస్మత్‌పటేల్, ప్రాణిమిత్ర రమేష్ జాగీర్దార్ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి రితీష్ జాగీర్దార్, ట్రస్టీ ముఖేష్ చౌహాన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తదితరులను వారి కార్యాలయాల్లో కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.