Home Page SliderInternational

వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్

వాట్సప్‌లో ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కాగా వాట్సప్‌లో మెసేజ్‌ను ఎడిట్ చేసే ఫీచర్‌ను బీటా తాజాగా ప్రవేశ పెట్టింది. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏటంటంటే మీరు వాట్సప్‌లో ఎప్పుడైనా ఏదైనా మెసేజ్‌ను తప్పుగా పంపినప్పుడు..దానిని వెంటనే ఎడిట్ చేసుకోవచ్చు. కాగా మెసేజ్ పెట్టిన 15 నిమిషాలలోపు ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే దీని ద్వారా కేవలం మెసేజ్‌ను మాత్రమే ఎడిట్ చేసేందుకు వీలుంటుందని బీటా వెల్లడించింది.