Home Page SliderNational

డ్రగ్స్ కేసులో అమృత్‌పాల్ సింగ్ సోదరుడి అరెస్టు

ఖలిస్థాన్ ఉద్యమనేత, వారిస్ దే పంజాబీ నేత అమృత్ పాల్ సింగ్ సోదరుడు హర్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో ఖాడూర సాహిబ్ నియోజక వర్గం నుండి ఎంపీగా గెలుపొందారు. జైలు నుండే స్వతంత్య్ర అభ్యర్థిగా  పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించాడు. గత వారం పెరోల్‌పై విడుదలై ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అతని సోదరుడు హర్ ప్రీత్ సింగ్ స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా పోలీసులు జరిపిన తనిఖీలలో డ్రగ్స్ కనిపించడంతో వారిని అరెస్టు చేశారు. హర్ ప్రీత్ సింగ్ ఒక ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.