Andhra PradeshHome Page Slider

పోలీసులకు అమృత్ పాల్ సింగ్ సరెండర్

గత 37 రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న మత ప్రబోధకుడు అమృత్ పాల్ సింగ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. పంజాబ్ మోగాలో పోలీసులు అమృత్ పాల్ ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మార్చి 18 నుంచి పోలీసుల కళ్ళు గప్పి అమృత్ పాలు తిరుగుతున్నారు. అయితే అరెస్టు విషయంలో వస్తున్న వదంతులను పోలీసులు కొట్టి పారేశారు. అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అరెస్టు విషయంలో అనవసరమైన తప్పుడు ప్రచారం చేయొద్దని పంజాబ్ పోలీసులు పిలుపునిచ్చారు. విచారణ కోసం ఆయనను అస్సాం దిబ్రుగర్ కు తరలించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.