లొంగుబాటుకు సిద్ధమైన అమృత్‌పాల్ సింగ్
పంజాబ్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన అమృత్‌పాల్ సింగ్ లొంగిపోవడానికి సిద్ధమయినట్లు సమాచారం లభించింది. దాదాపు ఐదువందల మంది పోలీసులు అమృత్‌సర్ స్వర్ణదేవాలయం వద్ద మొహరించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయంలోని అకాల్‌తక్త్ కార్యాలయంలో లొంగిపోనున్నట్లు భావిస్తున్నారు. ఈయన నేపాల్ పారిపోయినట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో అమృత్‌పాల్ అరెస్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది పోలీసులను ఇప్పటికే బదిలీ చేశారు.