లైగర్ సక్సెస్ కోసం అమ్మ పూజలు
యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలియని వారంటూ ఉండరు. అలానే ఈ హీరోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ హీరో నటించిన “ లైగర్ ” మూవీ హిట్ అవ్వాలని విజయ్ తల్లి పూజలు నిర్వహించి పురోహితులతో ఆశీర్వాదం ఇప్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలను విజయ్ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ ఈ నెల మొత్తం లైగర్ మూవీ ప్రమోషన్ కోసం దేశామంతట తిరిగి అందరి అభిమానాన్ని పొందడం దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్న..
కానీ అమ్మ మాత్రం దేవుడి రక్ష అవసరమని భావిస్తుంది , అందుకే ఈ పూజ. ఇప్పడు తను ప్రశాంతంగా నిద్రపోతుంది ‘ అని ట్వీట్ చేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మించిన లైగర్ మూవీ ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

