Home Page SliderNewstelangana,Trending Today

ANR అవార్డ్స్-2024 వేడుకకు అమితాబ్, చిరంజీవిలకు ఆహ్వానం..

అక్కినేని నాగేశ్వర్‌రావు శత జయంతిని ఘనంగా నిర్వహించేందుకు నాగార్జున రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ANR అవార్డ్స్-2024 ప్రదానోత్సవ కార్యక్రమానికి ఇద్దరు మెగాస్టార్లు రానున్నారు. బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నుండి చిరంజీవి ఈ కార్యక్రమానికి రానున్నారు. వారిద్దరినీ ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ కార్యక్రమం ఈనెల 28 (సోమవారం) నాడు జరుగుతుంది. ANR నేషనల్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు.