Home Page SliderTelangana

ఖమ్మంలో అమిత్‌షా పర్యటన వాయిదా

అమిత్‌షా తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు బ్రేక్ పడింది. అమిత్‌షా ఖమ్మం పర్యటన అర్థాంతరంగా వాయిదా పడింది. గుజరాత్‌లో బిపర్‌జోయ్ తుపాన్ బీభత్సం కారణంగా అమిత్‌షా పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే అమిత్ షా ఖమ్మం పర్యటన తేదీలను ప్రకటిస్తామని తెలియజేశారు బండి సంజయ్. దీనితో అమిత్ ‌షా గుజరాత్‌ను సందర్శించబోతున్నారనే సమాచారం వినిపిస్తోంది.