Home Page SliderNational

ఆసక్తిని రేకెత్తిస్తోన్న అమిత్‌షా ఈటల భేటీ

కేంద్రమంత్రి అమిత్‌షాతో మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమిత్‌షాకు ఈటల శుభాకాంక్షలు తెలిపారు. కాగా తెలంగాణా ఎంపీలు బండి సంజయ్,కిషన్ రెడ్డిలకు మోదీ క్యాబినెట్‌లో చోటు దొరికిన విషయం తెలిసిందే. అయితే మల్కాజ్‌గిరి నుంచి దాదాపు 7లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈటల రాజేందర్‌కు తెలంగాణా జీజేపీ అధ్యక్షుడి పదవి అప్పగిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఈటల అమిత్‌షాతో భేటీ అవ్వడం దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.