అమిత్‌షా కీలక ట్వీట్..
భారత్ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌పై భారత హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ట్వీట్ చేశారు. ఉగ్రవాదులు పాల్పడిన దారుణ హత్యలకు భారత్ స్పందనే ఈ ఆపరేషన్ సింధూర్ అని వ్యాఖ్యానించారు. దేశప్రజలపై జరిగే ఏ దాడికైనా తగిన స్పందన ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.


 
							 
							