మణిపూర్‌పై అమిత్ షా కీలక ఆదేశాలు
గత కొన్నేళ్లుగా జాతి వైషమ్యాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇటీవల రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్కడ అన్ని పరిస్థితులు చక్కబడ్డాయని, మార్చి 8 నుండి రాష్ట్రంలోని అన్ని మార్గాలలో స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ఏడు రోజులలో అక్కడ దాదాపు 300 ఆయుధాలను ప్రజల నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని సమాచారం. రాష్ట్రపతి పాలన కారణంగా గవర్నర్ నేతృత్వంలోని కేంద్ర బలగాలు, ఆర్మీ, పారా మిలటరీ అధికారులు అక్కడ సంచరిస్తూ, అడ్డంకులు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

