గురువారం రాష్ట్రానికి రానున్న అమిత్‌షా
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈనెల 27న హైదరాబాద్‌లోని నేష్‌నల్ పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొంటారు.
27న సూర్యాపేటలో బహిరంగ సభకు హాజరౌతారు: హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమత్రి అమిత్‌షా గురువారం రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లోని నేష్‌నల్ పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొంటారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేటలో నిర్వహించే పార్టీ ఎన్నికల బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుని అమిత్‌షా.. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం ఉంది. బహిరంగ సభపై సూర్యాపేటలో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు. సభకు రెండు రోజుల ముందు కోదాడ, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటిస్తుందని తెలిపారు. అంతకుముందు నూతన వ్యవసాయ మార్కెట్ సమీపంలోని సభా స్థలాన్ని పరిశీలించారు.


 
							 
							