నక్సల్స్ కు అమిత్ షా వార్నింగ్..
హింసను వీడి ఆయుధాలు అప్పగించాలని, నక్సల్స్ సరెండర్ కావాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఒక వేళ నక్సల్స్ లొంగిపోని పక్షంలో.. ఎరివేత ఆపరేషన్ ముమ్మరంగా చేపడతామని అమిత్ షా నక్సల్స్ కు వార్నింగ్ ఇచ్చారు. చత్తీస్ ఘడ్ లో నక్సల్ హింసతో లింకున్న 55 మంది బాధితులను ఉద్దేశించి ఆయన తన నివాసంలో మాట్లాడారు. 2026 మార్చి 31న మావోయిస్టులు తమ చివరి శ్వాస పీల్చుకుంటారని అమిత్ షా హెచ్చరించారు. ప్రస్తుతం చత్తీస్ ఘడ్ లోని కేవలం 4 జిల్లాలకే మావోలు పరిమితం అయినట్లు వెల్లడించారు. నేపాల్ లోని పశుపతినాథ్ నుంచి ఏపీలోని తిరుపతి వరకు కారిడార్ ను ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ప్లాన్ చేశారని.. కానీ మోదీ ప్రభుత్వం ఆ ప్లాన్ ను భగ్నం చేసిందన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంత ప్రజలు సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించనున్నట్లు అమిత్ షా తెలిపారు. నక్సల్ ప్రభావిత ప్రజల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా పేర్కొన్నారు.