బీజేపీ కార్యకర్త ఇంట్లో కాఫీ తాగిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టులో చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సాదర స్వాగతం పలికారు.
బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమిత్ షా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సికింద్రాబాద్‌లోని సాంబమూర్తి నగర్‌లో 30 ఏళ్లనుంచి బీజేపీ కార్యకర్తగా ఉన్న సత్యనారాయణ ఇంటికి వెళ్లి .. ఆయన యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు.. అనంతరం వారి ఇంట్లో కాఫీ తాగి.. అక్కడి నుంచి బేగంపేటలోని రామ్ మనోహర హోటల్‌కు చేరుకొని రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సాయంత్రం 4.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడు బహిరంగ సభకు వెళ్లనున్నారు అమిత్ షా.

