Home Page SliderInternational

పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా ఆగ్రహం

నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తిరిగి వస్తుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్, కాంగ్రెస్ అజెండాలు, ఉద్దేశం ఒక్కటేనని అమిత్ షా విమర్శించారు. ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టిందన్నారు అమిత్ షా. రాహుల్ గాంధీ గత కొన్నేళ్లుగా భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కక్ష సాధిస్తున్నారన్నారు. దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అమిత్ షా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, పాకిస్థాన్ ట్యూన్ ఎల్లప్పుడు ఒకేలా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడు దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతుందని అమిత్ షా ఆరోపించారు.