సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా అత్యవసర సమావేశం
ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలను భారత సైన్ం నేల మట్టం చేసింది. పాక్ తో పాటుగా పీఓకే లో ఉగ్రవాదుల స్థావరాలు.. శిక్షణా శిబిరాల పైన భారత వాయు సేన అర్ధరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. భారత్ పైన ప్రతీకార చర్యలు ఉంటాయని పాక్ మంత్రులు చెబుతున్నారు. ఇటు భారత్ అలర్ట్ అయింది. సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేయడానికి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, చీఫ్ సెక్రటరీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహిస్తున్నారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ మరియు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.


 
							 
							