Home Page SliderNational

అమిత్ షాకు పిచ్చెక్కింది..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పిచ్చెక్కిందని ఆర్జేడీ పార్టీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై నిన్న రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లాలు ఫైర్ అయ్యారు. ‘అమిత్ షాకు పిచ్చెక్కింది. రాజకీయాలు వదిలేయాలి. వెంటనే రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
రాజ్యాంగంపై చర్చలో భాగంగా నిన్న రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ.. మాటిమాటికి ‘అంబేద్కర్’ అనడం కాంగ్రెస్ కు ఫ్యాషన్ అయిపోయిందన్నారు. అంబేద్కర్.. అంబేద్కర్ అనడం మానేసి అన్ని సార్లు దేవుడిని స్మరిస్తే కనీసం స్వర్గానికైనా వెళ్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ కూడా అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకశక్తిగా మారుతోందని ఆరోపించారు.