చైనా ‘డీప్‌సీక్’కు పోటీగా అమెరికా సరికొత్త అస్త్రం
ఏఐ రంగంలో తాజాగా దూసుకుపోతున్న ‘డీప్‌సీక్’ నుండి అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. దీనికి చెక్ పెట్టాలని భావించి, సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ‘డీప్ రీసెర్చ్’ అనే చాట్‌జీపీటీ టూల్‌ను ఆవిష్కరించింది అమెరికా టెక్ దిగ్గజ సంస్థ ఓపెన్ ఏఐ. ఒక ఉద్యోగికి కొన్ని గంటలు పట్టే పనిని ఈ కొత్త టూల్ ద్వారా కేవలం పది నిమిషాలలో చేసి పెడుతుందని ఈ సంస్థ పేర్కొంది. సోమవారం టోక్యోలోని ఒక హైలెవల్ మీటింగుకు ముందుగు దీనిని ఆవిష్కరించింది ఓపెన్ ఏఐ సంస్థ. ఈ సందర్భంగా ఓపెన్ ఏఐ నెక్ట్స్ ఏజెంట్ అయిన ‘డీప్ రీసెర్చ్’ స్వతంత్య్రంగా పనిచేస్తుందని పేర్కొంది.