అమెరికా ఎన్నికలు ఏ స్టేట్ ఎవరికి?
అమెరికా ఎన్నికలలో సర్వేలకు అందని రీతిలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలలో ట్రంప్ అత్యధిక రాష్ట్రాలను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో ఇండియానా, మిస్సోరి, మిసిసిపి, వెస్ట్ వర్జీనియా, ప్లోరిడా వంటి 23 రాష్ట్రాలను 230 ఎలక్టోరల్ సీట్లతో ట్రంప్ సొంతం చేసుకున్నారు.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 205 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. కాలిఫోర్నియా, వాషింగ్టన్ సహా ఇల్లినోయూ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, న్యూయార్క్, కొలరాడో వంటి 12 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఇంకా కొన్ని ఫలితాలు తేలవలసి ఉంది. యువత అత్యధికంగా ట్రంప్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ట్రంప్‌కే మద్దతు ప్రకటిస్తున్నారు.


 
							 
							