అమెరికా ధర్మసత్రమేమీ కాదు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మతః పౌరసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రపంచ జనాభాకు ధర్మసత్రమేమీ కాదని వ్యాఖ్యానించారు. బానిసల పిల్లల కోసం తెచ్చిన చట్టాన్ని ఇతర దేశాల వారు స్వార్ధానికి ఉపయోగించుకునంటున్నారని, అందరూ వచ్చి అమెరికాలో పోగు పడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల ఈ పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడుతూ బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతోనే జన్మతః పౌరసత్వాన్ని అప్పట్లే ఆమోదించారు. కానీ ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాలో పోగు పడడం కోసం కాదు. అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ చట్టంపై సియాటిల్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌పై నేను సుప్రీంకోర్టుకు వెళ్తాను. అక్కడ తప్పకుండా అనుకూలమైన తీర్పు వస్తుంది. అంటూ పేర్కొన్నారు.

