Home Page SliderNational

విదేశాల్లో ఉన్న భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్

పర్యాటకం, వ్యాపారాల నిమిత్తం ప్రపంచంలోని వివిధ దేశాలను సందర్శిస్తూ B1,B2 వీసాలపై అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తీపి కబురు అందించింది. విదేశాల్లో ఉన్న భారతీయులు వారు పర్యటనలో ఉన్న దేశంలోని అమెరికా రాయబార కార్యాలయాల్లోనే వీసా అపాయింట్‌మెంట్ పొందొచ్చని అమెరికా స్పష్టం చేసింది. ఈ వీసా కోసం వారు ప్రత్యేకంగా భారత్‌లోని కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది.

దీని ప్రకారం భారతీయులు ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్న B1,B2 వీసాలపై అమెరికా పర్యటనకు వెళ్లాలనుకుంటే..ఇకపై ఆ దేశాలలోని అమెరికా రాయబార కార్యాలయాల్లోనే వారికి వీసా జారీ చేస్తారు. దీంతో విదేశాల్లో ఉన్న భారతీయులు అమెరికా వెళ్లాలనుకుంటే ఇకపై భారత్‌కు రానవసరం లేదు. అయితే మరికొన్ని రోజుల్లోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. కాగా ఇటీవల కాలంలో వీసా జారీలో తలెత్తున్న తీవ్ర జాప్యాన్ని నివారించేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంటునట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నిర్ణయం పట్ల విదేశాల్లో ఉన్న భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.