జనసేన వీరమహిళలపై అంబటి కౌంటర్
కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ , జగన్ పార్టీని ఉద్దేశించి చేస్తున్న ట్వీట్స్ గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ చేస్తున్న ట్వీట్స్‌కు మంత్రులు కౌంటర్లు వేస్తుండటంతో జనసేన వీరమహిళలు వారిపై విరుచుకుపడుతున్నారు. దమ్ముంటే పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని..అంతేగాని రాజకీయాల్లోకి వ్యక్తిగత విషయాలు తీసుకురావద్దు అంటూ ఫైర్ అవుతున్నారు. దీనిపై అంబటి జనసేన వీరమహిళలకు కౌంటర్ ఇచ్చారు. ‘నమస్కారం! బాబుని అందలం ఎక్కించాలనా? కళ్యాణ్ బాబుని సీఏం చేయాలనా? ఏమిటి మీ ప్రయత్నం? వివరంగా వివరించగలరా?’ అని ట్వీట్ చేయగా ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.