Andhra PradeshHome Page Slider

“బ్రో” సినిమా కలెక్షన్లపై అంబటి సెటైర్లు

ఏపీలో జనసేన ,వైసీపీ పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. కాగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన “బ్రో” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. బ్రో సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైందని ఆయన పరోక్షంగా విమర్శించారు. కాగా “బ్రో సినిమాతో ప్రొడ్యూసర్‌కు కలెక్షన్లు నిల్లు..ప్యాకేజీ స్టార్‌కు పాకెట్ ఫుల్లు!” అని ట్వీట్ చేశారు. అయితే బ్రో సినిమా విడుదలైనప్పుడు ఈ సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ అంబటి రాంబాబును పోలి ఉందని పలు రకాల విమర్శలు వచ్చాయి. దీనికి కౌంటర్‌గానే అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.