Andhra PradeshHome Page Slider

“జనసేన టీడీపీకి బలం మందు”:అంబటి రాంబాబు

ఏపీలో  చంద్రబాబు అరెస్ట్ పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. చంద్రబాబు అరెస్ట్‌తో  ఏపీ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మొన్నటివరకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ,జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్తున్నారు. అంతేకాకుండా పవన్ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో జనసేన పార్టీపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. జనసేన పార్టీ కాదని..టీడీపీ బలహీన పడినప్పుడు వేసుకునే బలం మందు అని ఆయన ట్వీట్ చేశారు.ప్రస్తుతం టీడీపీ అధినేత లేక బలహీనంగా ఉంది. కాబట్టే ..వారి అనుభవం ,జనసేన పోరాట పటిమతో జగన్‌ను ఓడించవచ్చని పవన్ నిన్నటి పెడన సభలో చెప్పారని మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్‌ను దుయ్యబట్టారు.