Home Page SliderInternational

అంబానీ కొత్త కోడలి ప్రేమలేఖ గౌను

ముకేష్ అంబానీ అంబానీ కొత్త కోడలి ప్రేమలేఖ గౌను ఫ్యాషన్ ప్రియులను నివ్వెరపరిచింది. అంబానీల  చిన్న కుమారుడు అనంత్ అంబానీ ముందస్తు వివాహ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అనంత్ కాబోయే భార్య రాధికా మర్చంట్ దుస్తులు, యాక్సిసరీస్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. గ్రాండ్‌గా జరగబోయే తన వివాహ వేడుకల కోసం ఎన్నో దుస్తులు కస్టమైజ్ చేయించుకున్నారు రాధిక. గతంలో తన 22 వ పుట్టినరోజుకు అనంత్ తనకు రాసిన అందమైన ప్రేమలేఖను ముద్రించి డిజైన్ చేసిన గౌనును తన రెండవ ప్రి వెడ్డింగ్ వేడుకలలో ధరించి అందరినీ అబ్బురపరిచారు. విలాస వంతమైన నౌకలో 4 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలలో ఆమె ఫొటోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆమెకు మంచి ఫ్యాషనిస్టుగా కూడా పేరుంది. సందర్భాన్ని బట్టి దుస్తుల్ని కస్టమైజ్ చేయించుకున్నారు. ఈ పార్టీలో అంతర్జాతీయ స్టార్స్ పాల్గొన్నారని సమాచారం. స్టారీ నైట్ థీమ్ అనే ఈవెంట్‌లో అనంత్ రాసిన ఈ ప్రేమలేఖ గౌనును ధరించి హైలెట్‌గా నిలిచింది. ఈ ప్రేమలేఖతోనే అనంత్ తన మనసులో నాస్థానమేంటో చెప్పాడని, దానిని తమ పిల్లలకు, వారి పిల్లలకూ కూడా చూపిస్తానంటూ మురిసిపోయింది రాధిక. లండన్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ రోబర్డ్ వున్ రాధిక అభిరుచుల మేరకు ఈ గౌనును రూపొందించారు.