ఉద్యోగులను తీసేస్తేనే కంపెనీ బాగుపడుతుందన్న అమెజాన్ సీఈవో
27,000 ఉద్యోగులను సాగనంపడం బాధాకరం
ఉద్యోగుల తొలగింపుతో అమెజాన్ బలోపేతం
తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం-ఆండీ జాస్సీ
కానీ వారందరినీ ఆదుకుంటామన్న అమెజాన్ సీఈవో
అమెజాన్ CEO ఆండీ జాస్సీ సంస్థ ఉద్యోగులకు వార్షిక లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. ఖర్చు తగ్గించే ప్రయత్నాలు అమెజాన్ ఎదుగుదలకు సహాయపడతాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇ-కామర్స్ దిగ్గజం అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన లేఖలో, 27,000 మంది ఉద్యోగులను తొలగింపు కష్టమైనదని, అయితే దీర్ఘకాలంలో కంపెనీకి ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకారి అని అన్నారు. “గత కొన్ని నెలలుగా, కంపెనీని లోతుగా పరిశీలించాం, వ్యాపారం ద్వారా వ్యాపారం, ఆవిష్కరణ ద్వారా ఆవిష్కరణ, తగినంత ఆదాయం, నిర్వహణ ఆదాయం, ఫ్రీ క్యాష్ ఫ్లో సంస్థలో కొనసాగడం కోసం కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ప్రశ్నించుకున్నాం. పెట్టుబడి పెట్టిన మూలధనంపై రాబడిని అంచనా వేశాం.”అంటూ లేఖలో పేర్కొన్నాడు. బుక్‌స్టోర్‌లు, 4 స్టార్ స్టోర్‌లు, ఫిజికల్ స్టోర్ కాన్సెప్ట్‌లు వర్కౌట్ కావని నిర్ణయించామన్నారు. అందుకే వాటిన్నింటినీ మూసేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సీఈవో ఆండీ జాస్సీ చెప్పారు.

అర్ధవంతమైన రాబడికి మార్గం లభించని సంస్థలు అమెజాన్ ఫ్యాబ్రిక్, అమెజాన్ కేర్‌ను మూసివేయడం ద్వారా, సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని చెప్పారు. మానవ వనురులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ. ఐతే 27 వేల కార్పొరేట్ రోల్స్ తొలగించాలనే కఠినమైన నిర్ణయం తప్పనిసరైందని చెప్పుకొచ్చారు. మొత్తం ఖర్చులను క్రమబద్ధీకరించడానికి కొన్ని నెలలుగా కసరత్తు చేశామన్నారు. ఆయా టీమ్స్ ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయో బేరీజు వేసుకుంటూనే ఉన్నామని… అందుకే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదని అమెజాన్ సీఈవో చెప్పారు. అదే సమయంలో అవసరమైన చోట… సిబ్బందిని నియమించుకోవడమన్నది నిరంతర ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

అదనంగా, సిలికాన్ వ్యాలీ దృష్టిని ఆకర్షించి, మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య సాంకేతిక ఆయుధ పోటీని రేకెత్తించిన ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలెజిన్స్ చాట్‌జిపిటి వంటి కృత్రిమ మేధస్సు సాధనాల పెరుగుదల కారణంగా అమెజాన్ కృత్రిమ మేధస్సు వంటి కొత్త రంగాలలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన లేఖలో తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా, కంపెనీ వివిధ రకాల అప్లికేషన్‌లకు మెషిన్ లెర్నింగ్‌ని వర్తింపజేసిందని జాస్సీ పేర్కొన్నారు. ప్రస్తుతం AI ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యామన్న ఆయన… వచ్చే రోజుల్లో ఇది కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందన్నారు.

