ఘనంగా ఏపీలో రిపబ్లిక్ డే వేడుకలు
ఆంధ్రప్రదేశ్‌లో ఘనతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ గన్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీలో ప్రభుత్వ పథకాల పేద ప్రజలకు అందుతున్నాయన్నారు గవర్నర్. డీబీటీ ద్వారా నవరత్నాల పథకాల ప్రజలకు నేరుగా చేరుతున్నాయన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమం చేరువయ్యిందన్నారు.
