Home Page SliderInternationalSports

అసీస్‌పై టీమిండియా అద్భుతవిజయం

పెర్త్ వేదికగా జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మొదటి టెస్టులో అసీస్‌పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో నిలిచింది. భారత్ డిక్లేర్ చేసిన 534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా బ్యాటర్స్ తడబడ్డారు. భారత్ బ్యాట్స్‌మన్ దాటికి రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 238 పరుగులకే ఆలౌటయ్యారు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్ కలిపి 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా తన బాల్‌తో అసీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన కెప్టెన్ బుమ్రా నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై మొట్టమొదటిసారి ఇంత భారీ విజయాన్ని నమోదు చేసినందుకు భారత్ అభిమానులు ఖుషీగా ఉన్నారు.