Andhra PradeshHome Page Slider

అద్భుత ప్రతిభ..పెన్సిల్‌పై నవదుర్గలు

ఏపీకి చెందిన సూక్ష్మకళాకారుడు  కోటేష్ అద్భుతాన్ని చేసి చూపించారు. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ దసరా నవరాత్రుల సందర్భంగా పెన్సిల్‌పై 9 అవతారాల అమ్మవారిని చిత్రీకరించారు. చిన్న కలర్ పెన్సిల్‌పై చుట్టూ మూడువైపులా 9 రూపాలతో కన్నులవిందుగా ఉన్నాయి చిత్రాలు. వీటిని చిత్రీకరించడానికి కేవలం అరగంట పట్టింది. చిత్రకారుడు ఈ విషయం తెలియజేస్తూ జగన్మాత మహిషాసురుడితో 9 రోజుల పాటు యుద్ధం చేసి సంహరించిందని, విజయం సాధించిందన్నారు. అందుకే 10 రోజుల పాటు ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన ఈ తొమ్మిది రూపాలలో ఉత్తర భారత దేశంలో పూజించే శైలపుత్రి, కూష్మాండ, బాల త్రిపుర సుందరి, బ్రహ్మచారిణి, స్కందమాత,కాత్యాయిని, భద్రకాళి, దుర్గ, మహిషాసుర మర్థిని వంటి చిత్రాలు అలవోకగా చిత్రించారు.