అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుంది..
అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతి పున:ప్రారంభ సభలో మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచి పెట్టింది. అమరావతి రైతులకు అండగా ఉంటామని రైతులకు మాటిచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. రైతుల త్యాగాలను మరిచిపోం. అమరావతి నిర్మాణం జరిగేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తాం.’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.