Andhra PradeshHome Page Slider

మన రాజధాని అమరావతి: చంద్రబాబు

ఈ రోజు విజయవాడలో ఎన్డీయే శాసనసభ పక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..ఏపీ రాజధాని అమరావతి అని ఆయన ప్రకటించారు. కాగా విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు.అంతేకాకుండా కర్నూలును కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖను రాజధానిగా చేస్తానంటే నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ అని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని చివరికి ఏమి చేయలేదన్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలో తక్కువ సీట్లు వస్తాయని తొలుత భయపడ్డాను. కానీ అక్కడ కూడా కూటమికి మంచి సీట్లు వచ్చాయని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.