ఏపీ హైకోర్టుకు అమరావతి రైతులు
ఏపీలో గత కొన్ని సంవత్సరాలుగా అమరావతి రైతులు ఆందోళనలతో హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమరావతి రైతులు పాదయాత్ర విషయమై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి రైతులు అమరావతి నుంచి అసరవల్లి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పాదయాత్రకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం హైకోర్టును కొంత సమయం ఇవ్వాలని కోరింది. దీంతో హైకోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

