Breaking Newshome page sliderHome Page SliderInternational

భారత్ పై అమాన్ అజ్మీ కారుకూతలు

భారతదేశం ముక్కలు కానంత వరకు బంగ్లాదేశ్‌లో శాంతి నెలకొనదని బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నందున ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయని ఆయన అన్నారు. గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్ నాయకులు భారత్‌పై విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఆయన వ్యాఖ్యలతో భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఆయనపై అసహనం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ విముక్తికి భారత్ చేసిన సహాయాన్ని మరిచి, ఆ దేశ నాయకులు విషం చిమ్మడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలు తిరిగి పునరుద్ధరించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తున్న సమయంలో అమాన్ అజ్మీ చేసిన వ్యాఖ్యలు సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో భారత–బంగ్లాదేశ్ సంబంధాల భవిష్యత్తు, పరస్పర సంభాషణలపై ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.