Home Page SliderTelangana

మోడీ, కేసీఆర్‌ల కలలకు నేనే కారణమౌతానేమో..

మహబూబ్‌నగర్, షాద్‌నగర్: కొద్ది రోజులుగా నేను మోడీ, కేసీఆర్‌లకు కలలోకొస్తున్నా. వారు అర్ధరాత్రి లేచి ఉలిక్కిపడుతున్నారు. తనను తలచుకుని భయపడుతున్నారు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాను చేసిన జోడో యాత్రతో వారిని భయం వెంటాడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో 2 శాతం ఓట్లొచ్చే బీజేపీ బీసీని ఎలా ముఖ్యమంత్రిని చేస్తుందో అది మిస్టరీగానే తోస్తోంది? కాళేశ్వరం పిల్లర్స్ పడిపోతున్నా సీఎం పరిశీలించలేదు. షాద్‌నగర్, కల్వకుర్తి, జడ్చర్ల సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన మాటలు.