Home Page SliderInternationalNational

ఇప్పటికే 12 వేల ఉద్యోగాలు ఔట్, మళ్లీ కోత తప్పదన్న గూగుల్ సీఈవో పిచాయ్!

జనవరిలో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఆరు శాతం లేదా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, రెండవ రౌండ్ తొలగింపులు ఉండొచ్చని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంపెనీలో త్వరలో మరిన్ని తొలగింపులు చేసే అవకాశం ఉందని పిచాయ్ వివరించాడు. దీనిపై క్లారిటీ ఇవ్వనప్పటికీ.. సిట్యువేషన్ అలాగే ఉందన్నాడు.

Google ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ బార్డ్, Gmail, Google డాక్స్, ఇతర ప్రాజెక్ట్‌లలో కొత్త వర్క్‌స్పేస్ సామర్థ్యాలను ప్రస్తావిస్తూ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “మాకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను. పని మిగిలే ఉంది. AIతో ఒక ముఖ్యమైన ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ కూడా ఉంది. అవకాశం ఉన్నచోట, ఉద్యోగులను అత్యంత ముఖ్యమైన విభాగాలకు సర్దుబాటు చేస్తాం. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ.”

కంపెనీ సామర్థ్యాన్ని 20 శాతం ఎలా పెంచుతుందని భావిస్తున్నారనే ప్రశ్నకు సమాధానంగా, దాని వ్యయ స్థావరాన్ని శాశ్వతంగా రీ-ఇంజనీరింగ్ చేసే ప్రయత్నంలో కంపెనీ ఉందన్నారు. చేసే ప్రతి అంశాన్ని అక్షరాలా పరిశీలించి చేస్తున్నామన్నారు పిచాయ్. మరిన్ని పనులు చేయాల్సి ఉందని వివరించారడు. పొదుపు ఎంత వరకు చేయాలో అంత వరకు మాత్రం కచ్చితంగా చేస్తామన్నాడు పిచాయ్. జనవరిలో, గూగుల్ 12,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తొలగింపుల గురించి ఊహాగానాలు నెలల తరబడి తిరుగుతున్నప్పటికీ, ఆ ప్రకటన చాలా మందిలో ఆందోళన కలిగించింది.

ఎంతో ఆలోచించాక, ఉద్యోగుల కోత మొదలుపెట్టామన్నాడు. వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12,000 తగ్గించాలని నిర్ణయించుకున్నామన్న పిచాయ్… ఇప్పటికే USలో ప్రభావితమైన ఉద్యోగులకు ప్రత్యేక ఇమెయిల్‌ను పంపించామన్నాడు. ఇతర దేశాలలో, స్థానిక చట్టాలు, ఇతర ప్రక్రియల కారణంగా ఈ ప్రక్రియ ఎక్కువ సమయం పడుతోందని పిచాయ్ తెలిపాడు. భారతదేశంలోని వివిధ విభాగాలలో సుమారు 450 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించినట్లు ఫిబ్రవరిలో పేర్కొంది. అయితే, తొలగింపులలో ఆల్ఫాబెట్ ఇంక్ ప్రకటించిన 12,000 ఉద్యోగాల కోతలు ఉన్నాయా అనేది స్పష్టంగా తెలియడం లేదు.