Home Page SliderTelangana

డైరక్టర్ సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ దాడులు

ఈరోజు హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లకు, ఆఫీసులకు ఐటీ దాడులు బెంబేలెత్తిస్తున్నాయి. భారీ బడ్జెట్‌లతో సినిమాలు నిర్మిస్తున్న ప్రముఖ సంస్థ మైత్రీ మూవీస్‌పై ఐటీ రైడ్స్ జరగడం సంచలనంగా మారింది. ఈ సంస్థ డైరక్టర్లుల నవీన్‌ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ ఇళ్లలో ఈ రోజు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ 2017లో ప్రారంభమై శ్రీమంతుడు చిత్రంతో మొదలుపెట్టింది. కొద్దికాలంలోనే పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తోంది. గత సంవత్సరం వచ్చిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప సూపర్ హిట్ కావడంతో ఆ చిత్రడైరక్టర్ సుకుమార్‌తోనే పుష్ప 2 కూడా ప్లాన్ చేసింది. గత డిసెంబరులో కూడా ఈ సంస్థపై ఐటీ రైడ్స్ జరగాయి. కానీ అప్పుడు జీఎస్టీ రైడ్స్ అని చెప్పారు. ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కూడా మైత్రి మూవీస్‌వే. వందల కోట్లరూపాయల భారీ బడ్జెట్‌లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. వాటి వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వీటికి సరైన టాక్స్‌లు కట్టారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనితో ఐటీ దాడులు జరుగుతున్నట్లు భావిస్తున్నారు.